విద్యార్థిని చితకబాదిన టీచర్‌

English Teacher Beaten Student in Kurnool ZP School - Sakshi

కర్నూలు, దేవనకొండ: మండలకేంద్రమైన దేవనకొండ జెడ్పీ పాఠశాల ఇంగ్లిషు టీచర్‌ అరుణ కుమారి పదోతరగతి విద్యారి వీరేష్‌ను తీవ్రంగా చితకబాదింది. సంక్రాంతి సెలవుల్లో హోం వర్క్‌ చేయలేదని తోటి విద్యార్థుల ముందే విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి స్కూలుకు చేరుకుని  ఇంగ్లిషు టీచర్‌తో వాగ్వాదానికి దిగింది. తప్పు చేస్తే మందలించాలే తప్ప శరీరంపై వాతలు పడేలా కొడతారా అని నిలదీశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top