ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలి

Engineering Student Suicide In Ananthapuram - Sakshi

సాక్షి, అనంతరపురం : ర్యాగింగ్‌ భూతానికి మరో ఇంజనీరింగ్‌ విద్యార్థిని బలైంది. అనంతరపురం జిల్లా పట్నం గ్రామానికి చెందిన ప్రియాంక మదనపల్లి గోల్డెన్‌ వ్యాలీ ఇంజనీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. గత కొంత కాలంగా సీనియర్‌ విద్యార్థి తనపై వేధిపులకు పాల్పడుతున్నారని కళాశాల ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేసింది. నిన్న సాయంత్రం బస్‌లో వెళ్తున్న సమయంలో కూడా మరోసారి వేధించాడని తీవ్ర మనస్తాపన చెందిన ప్రియాంక సూపర్‌ వాస్మోల్‌ తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులపై కళాశాల ప్రిన్సిపాల్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top