ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్‌ | employees union fires on Transport Commissioner Balasubrahmanyam incident | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్‌

Mar 26 2017 12:17 PM | Updated on Sep 5 2017 7:09 AM

ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్‌

ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్‌

ఉన్నతాధికారిపై ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడటంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి

విజయవాడ: ఉన్నతాధికారిపై ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడటంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఆదివారం విజయవాడ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంకు సంఘీభావం తెలిపాయి.

ఐపీఎస్‌ అధికారిపై దాడి ఘటనలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్‌రావు, బుద్దా వెంకన్నలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఐపీఎస్‌ అధికారిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. దాడికి పాల్పడిన నేతలు ఉద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే పెన్‌డౌన్‌ చేపడుతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement