వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వరల్డ్‌కప్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వరల్డ్‌కప్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని శ్రీ మంజునాథ రైస్ మిల్లులో బెట్టింగ్‌కు పాల్పడుతుండగా పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రూ. 4.02 లక్షల నగదు, 8 సెల్ ఫోన్‌లు, ఒక ఎల్‌ఇడీ టీవీని స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్, త్రీ టౌన్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడిలో పాల్గొన్నారని డీఎస్పీ పూజిత తెలిపారు.