‘వారం రోజుల్లో ఆర్థిక సాయం అందేలా చూస్తాం’ | Eight Fishermen have Reached Vizianagaram From Bangladesh | Sakshi
Sakshi News home page

‘వారం రోజుల్లో ఆర్థిక సాయం అందేలా చూస్తాం’

Feb 4 2020 3:24 PM | Updated on Feb 4 2020 3:29 PM

Eight Fishermen have Reached Vizianagaram From Bangladesh - Sakshi

సాక్షి, విజయనగరం :  బంగ్లాదేశ్ చెర నుండి విడుదలైన 8 మంది మత్స్యకారులు మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ ఎం హరిజవహార్‌లాల్‌, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు వీరిని కలెక్టర్‌ కార్యాలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. విడుదలైన మత్స్యకారుల కుటుంబాలకు ప్యాకేజ్ రూపంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. 

వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మంజూరు అయ్యే అవకాశం ఉందని, మరమ్మతులకు గురైన బోటు పునరుద్ధరించేందుకు కూడా సహాయం అందించేందుకు ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. విడుదలైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని నెల్లిమర్ల ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి మత్స్యకారుల సహాయం అంశం తీసుకువెళ్ళి ఆర్థిక ప్యాకేజ్ మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం మత్స్యకారుల విడుదల కోసం కృషి చేసిన వాసుపల్లి జానకిరామును  జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే బడ్డుకొండ సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement