జాతివైరం పక్కనపెట్టిన అమ్మ మనసు | Dog is Raising the Pig Kids In Kurnool | Sakshi
Sakshi News home page

జాతివైరం పక్కనపెట్టిన అమ్మ మనసు

Jul 5 2019 7:19 AM | Updated on Jul 5 2019 7:20 AM

Dog is Raising the Pig Kids In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : అమ్మ.. పిల్లల ఆకలి తీరుస్తుంది తప్ప జాతీ వైషమ్యాలు చూడదని ఓ శునకం నిరూపించింది. కర్నూలు మాధవనగర్‌కు చెందిన శునకం ఆకలితో ఉన్న పంది పిల్లలకు నిత్యం పాలిస్తూ అమ్మతనానికి మరేది సాటి రాదని చాటి చెబుతోంది. పది రోజుల క్రితం ఈ శునకం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నాలుగు రోజులకే ఆ పిల్లలు అనారోగ్యంతో చనిపోయాయి. అప్పటి నుంచి జాతి వైరం పక్కనపెట్టి పంది పిల్లలకు పాలిస్తోంది. నిత్యం వాటిని వెంట తిప్పుకుంటూ ఆకలి తీరుస్తోంది. ఇదంతా చూస్తున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ప్రేమ ఔన్నత్యం గురించి గుర్తు చేసుకుంటున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement