ఈ పిల్లి 'మ్యావ్‌' అనదు.. ‘మామ్‌’ అంటుంది..! | Elderly Woman Bond With Her Cat Is Pure Gold | Sakshi
Sakshi News home page

ఈ పిల్లి 'మ్యావ్‌' అనదు.. ‘మామ్‌’ అంటుంది..!

May 14 2023 8:09 AM | Updated on May 14 2023 8:09 AM

Elderly Woman Bond With Her Cat Is Pure Gold - Sakshi

ఈ పిల్లి ‘మ్యావ్‌’ అంటుందా? ‘మామ్‌’ అంటుందా? అనే విషయం కాస్త కన్‌ఫ్యూజ్‌గా ఉన్నప్పటికీ ‘మామ్‌’ అంటుందనే శబ్దభ్రమను కలిగిస్తుంది. ముంబైకి చెందిన ఒక మహిళ పిల్లిని పెంచుకుంటుంది. ఆమె పేరేమిటో తెలియదుగానీ పిల్లి పేరు జగ్గు. ఒక విధంగా చెప్పాలంటే ఈ జగ్గు ఆమెకు కన్న కొడుకుగా మారిపోయి, ఆమెను నీడలా అనుసరిస్తోంది. వీరి బంధాన్ని ప్రతిబింబించే వీడియో ఎన్నో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ అయింది.

ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ‘జగ్గు పాటిల్‌’లో జగ్గు ప్రతి మూమెంట్‌ను డాక్యుమెంట్‌ చేశారు. ‘మదర్స్‌ లవ్‌ ఈజ్‌ యూనివర్శల్‌’  ‘ఎందరో తల్లులు. ప్రేమ మాత్రం ఒక్కటే’  ‘భావోద్వేగాలు మనుషులకు మాత్రమే పరిమితమైనవి కావు’  ‘ఇలాంటి ప్రేమ మన దేశంలోని తల్లులకు మాత్రమే సాధ్యపడుతుంది. భగవంతుడు కోరుకునేది ఇదే’  ‘నిజమైన ప్రేమకు నిలువెత్తు సంతకం... తల్లి’... అంటూ నెటిజనులు స్పందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement