మాతృభూమిని మర్చిపోవద్దు | Do not forget to homeland | Sakshi
Sakshi News home page

మాతృభూమిని మర్చిపోవద్దు

Jan 17 2015 1:22 AM | Updated on Jul 6 2018 3:32 PM

మాతృభూమిని మర్చిపోవద్దు - Sakshi

మాతృభూమిని మర్చిపోవద్దు

ఉన్నత చదువులు చదివి, ఆర్దికంగా బలపడినా మాతృభూమిని మాత్రం మర్చిపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు.

రంగారెడ్డిపాలెం(నరసరావుపేటరూరల్): ఉన్నత చదువులు చదివి, ఆర్దికంగా బలపడినా మాతృభూమిని మాత్రం మర్చిపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని రంగారెడ్డిపాలెంలో మాతృభూమి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన గోల్కొండ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నడికట్టు రామిరెడ్డితో కలిసి పాల్గొని ముఖ్యఅతిధిగా మాట్లాడారు. పదేళ్ళ నుంచి వరుసగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్న రంగారెడ్డిపాలెం ప్రజలను ఆయన అభినందించారు.

చనిపోయే వరకు తాను జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే నడుస్తానని చెప్పారు. గోల్కొండ హోటల్ అధినేత నడికట్టు రామిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి ఆర్ధికంగా బలపడిన వారందరూ తాము పుట్టిపెరిగిన గ్రామాలను అభివృద్ది చేయాలని సూచించారు. తొలుత గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి, నడికట్టు రామిరెడ్డిలకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో వైఎస్సార్, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు అధ్యక్షుడు దొండేటి అచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ షేక్ నూరుల్‌అక్తాబ్, ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, గ్రామసర్పంచ్ దొండేటి అప్పిరెడ్డి, ఎంపీటీసీ పోతిరెడ్డి శివారెడ్డి, ఉపసర్పంచ్ నల్లగంగుల యజ్ఞారెడ్డి, ఎమ్మెల్యే అధికార ప్రతినిది కొమ్మనబోయిన శంకరయాదవ్, ఎస్సీసెల్ సెల్ మహిళా కన్వీనర్ ఎస్.సుజాతాపాల్, మండల సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు చల్లా నారపరెడ్డి, మాతృసేవా చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మెట్టు అంజిరెడ్డి, గ్రామనాయకులు మూరే రవీంద్రరెడ్డి, యేరువ చంద్రమౌళిరెడ్డి, హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement