తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా దీపావళి పండగ రోజు ఆస్థానం నిర్వహించటం ఆనవాయితీ. స్వామి సన్నిధిలోని బంగారు వాకిలి ఎదుట సర్వభూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి పూజలు నిర్వహించారు. ఆస్థానం నేపథ్యంలో సుప్రభాతం మినహా ఆర్జిత సేవలన్నింటిని తితిదే రద్దు చేసింది. తితిదే అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు దంపతులు ఆస్థానం కార్యక్రమంలో పాల్గొన్నారు.