విభజన అంశాలపై పార్లమెంటులో చర్చించాలి | division issue willbe talk in parliament | Sakshi
Sakshi News home page

విభజన అంశాలపై పార్లమెంటులో చర్చించాలి

Feb 18 2015 2:43 AM | Updated on Sep 2 2017 9:29 PM

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎజెండాగా చేర్చాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన విషయాలన్నింటినీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఎజెండాగా చేర్చాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వివరాలను రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పొందుపరచాలని కోరుతూ ప్రధాని మోదీకి ఈ మేరకు ఆయన లేఖ రాశారు. రఘువీరా మంగళవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు రాయలసీమ, ఉత్తర కోస్తాలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కోసం కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన కన్పిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 27 లక్షల సంతకాలు సేకరించామన్నారు. ఈ-మెయిల్, మిస్డ్ కాల్ (7842434121) నంబరుకు కూడా ప్రజలు బాగా స్పందిస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో లొసుగులు ఉన్నాయని పదేపదే చెబుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య ఆ లొసుగులేమిటో వెల్లడించాలన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పోలీసులు, ఎన్నికల అధికారులు కుమ్మక్కై రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement