అభిమాన నేతకు ఆప్యాయ కానుక | disabled children gift for ys jagan | Sakshi
Sakshi News home page

అభిమాన నేతకు ఆప్యాయ కానుక

Jul 17 2014 1:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

అభిమాన నేతకు ఆప్యాయ కానుక - Sakshi

అభిమాన నేతకు ఆప్యాయ కానుక

పాచిపెంట మండలం డబ్బూరివలసలో హోలీ స్పిరిట్ పాఠశాలకు చెందిన మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి

డబ్బూరివలస (బొబ్బిలి రూరల్): పాచిపెంట మండలం డబ్బూరివలసలో హోలీ స్పిరిట్ పాఠశాలకు చెందిన మానసిక, శారీరక వికలాంగ విద్యార్థులు వైఎస్‌ఆర్‌సీపీ  అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం ఆప్యాయ కానుక అందించారు. హోలీ స్పిరిట్ సిస్టర్లు సెల్వి, షకీలా, రాణిల ఆధ్వర్యంలో 300 మంది వికలాంగ చిన్నారులు జగన్‌మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన అపురూప పెయింటింగ్‌ను కానుకగా అందించారు. వారితో జగన్‌మోహన్ రెడ్డి ప్రేమగా మాట్లాడారు. మూడు వందల మంది శారీరక, మానసిక వికలాంగులతో పాటు వంద మంది గిరిజన విద్యార్థులు ఉన్నారని సిస్టర్ సెల్వి వివరించారు. చిన్నారుల ప్రేమకు పులకరించిపోయిన జగన్‌మోహన్ రెడ్డి అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement