వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం

Published Thu, Sep 26 2013 1:29 AM

different reasons Three Killed

తుర్కపల్లి న్యూస్‌లైన్ :  వేర్వేరు కారణాలతో జిల్లాలో బుధవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధతో ఒకరు, ఆర్థిక సమస్యలతో ఇంకొకరు, మద్యానికి బానిసై మరోకరు బలవన్మారణానికి పాల్పడ్డారు. వివరాలు. తుర్కపల్లి మండలం వాసాలమర్రికి చెందిన బెజ్జనబోయిన సత్తయ్య,అండాలు (49) వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి, ఇంటి నిర్మాణానికి అప్పు లు చేశారు. తమకున్న నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, వరి సాగు చేయగా వరుస కరువుతో పంట చేతికందలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా అంతంత మాత్రమే. రుణదాతలు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కుటుంబ తగాదాలు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన అండా లు తెల్లవారుజామున ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడుపునొప్పి ఎక్కువై కేకలు వేయడంతో కుటంబ సభ్యులు గమనించారు. చికిత్స నిమిత్తం ఆమెను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్కలో మృతిచెందింది.  మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె ఉంది. మృతురాలి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ అభిలాష్ తెలిపారు.
 
 ఉరివేసుకొని ఇద్దరు..
 చౌటుప్పల్: చౌటుప్పల్‌కు చెందిన కొక్కు శేఖర్(35) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శేఖర్ దర్జీగా పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన శేఖర్ భార్య, పిల్లలను పట్టించుకోవడంలేదు. దీంతో భార్య పిల్లలను తీసుకొని, ఇటీవలే పుట్టింటికి వెళ్లి పోయింది. మనస్తాపానికి గురైన శేఖర్ మంగళవారం రాత్రి, ఇంట్లో ఉరివేసుకొని మృతిచెందాడు. బుధవారం ఉదయం ఇరుగుపొరుగువారు చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. ఇతని మృతిపై  ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
 
 యాదగిరిగుట్ట :  యాదగిరిగుట్ట పట్టణ శివారు చాకలిగిద్దె చెరువు సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువులు మేపేందుకు కాపరు లు అక్కడికి వెళ్లగా చెట్టుకు మృతదేహం వెలాడుతూ కని పించింది. దీంతోవారు పోలీసులకు సమాచారం ఇవ్వడం తో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు  పట్టణంలోని పాతగుండ్లపల్లికి చెందిన ఎస్ సత్తయ్య (45)గా గుర్తించారు. ఇతడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. మన స్తాపానికి గురై  ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నా రు.కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  ఎస్‌ఐ నర్సింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.   
 
 

Advertisement
Advertisement