దైవదర్శనానికి వెళ్లి నదిలో గల్లంతు | Daivadarsanani went missing in the river | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వెళ్లి నదిలో గల్లంతు

Aug 4 2014 1:22 AM | Updated on Aug 1 2018 2:29 PM

దైవదర్శనానికి వెళ్లి నదిలో గల్లంతు - Sakshi

దైవదర్శనానికి వెళ్లి నదిలో గల్లంతు

మండలంలోని పాత రావిచర్లకు చెందిన యువకుడు స్నేహితులతో కలిసి భద్రాచలంలో స్వామివారి దర్శనానికి వెళ్లాడు.

  •   పర్ణశాల వద్ద గోదావరిలో మునిగిన యువకుడు
  •   స్వగ్రామం పాత రావిచర్ల
  •   తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
  • పాతరావిచర్ల(నూజివీడు రూరల్) : మండలంలోని పాత రావిచర్లకు చెందిన యువకుడు స్నేహితులతో కలిసి భద్రాచలంలో స్వామివారి దర్శనానికి వెళ్లాడు.  మార్గమధ్యంలో వారు పర్ణశాలలో ఆగారు. ఆ యువకుడు గోదావరిలో  గల్లంతయ్యాడు. స్నేహితులు ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. కుమారుడి జాడ కోసం దంపతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  యువకుడి తండ్రి, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం...
     
    పాత రావిచర్లకు చెందిన కొణతం వీర్రాజు, లక్ష్మీకుమారి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో పెద్దవాడైన చెన్నారావు(22)కు, కుమార్తె భవానికి(20)కి వివాహమైంది. చిన్నవాడైన కొణతం లోక్‌నాధ్(19) ఏడో తరగతితో చదువు మానేశాడు. కొత్తరావిచర్ల గ్రామ శివారులోని సాయి ఆగ్రో కంపెనీలో నెలరోజుల క్రి తం ఉద్యోగంలో చేరాడు.

    కంపెనీ యజమాని వారానికొకసారి జీ తాలు ఇస్తుంటాడు. లోక్‌నాధ్ శని వారం సాయంత్రం జీతం తీసుకున్నాడు. గ్రామానికి చెందిన స్నేహితులు మందనాటి నాగరాజు, మందపాటి ఏడుకొండలు, పాలకుర్తి వెంకటేశ్వరరావు, కొలుసు రాంబాబు, మందపాటి కుమారస్వామి, ఆరేపల్లి రమేష్‌లతో కలిసి మరీదు రాముకు చెందిన ఆటోలో శనివారం రాత్రి భద్రాచలం వెళ్లాడు.

    గ్రామంలో అనుకున్నట్లు కాకుండా వారందరూ ముందుగా భద్రాచలానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు ఆదివారం ఉదయం ఆరు గంటలలోపు చేరుకున్నారు. అక్కడ గోదావరిలో స్నానానికి ఉపక్రమించారు. కొందరు మహిళలు స్నానం చేస్తుండటంతో కొంత ముందుకు వెళ్లారు. లోక్‌నాధ్ అక్క డ కాలుజారి నదిలో పడి కొట్టుకుపోయాడు. అతడిని రక్షించేందుకు మిత్రులు యత్నించారు. నది ఉధ్రుతంగా ప్రవహిస్తుండటంతో వారి ప్రయత్నా లు ఫలించలేదు. అతడి మిత్రులు గ్రామంలోని తమ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, ఈ విషయాన్ని చెప్పారు.

    శనివారం రాత్రి 11 గంటలకు ఇంటినుంచి బయలుదేరిన కుమారుడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలైనా ఫోన్ చేయకపోవడంతో స్వామివారి దర్శనం కోసం వేచి ఉంటాడని తల్లిదండ్రులు భావించారు. కుమారుడితో కలిసి వెళ్లిన స్నేహితులు ఎక్కడున్నారో ఫోన్ చేశారా ?అని వారి తండ్రులను వీర్రాజు ఆరా తీ శారు. మీ కుమారుడు గోదావరిలో ప్రమాదవశా త్తు పడి గల్లంతయ్యాడని వారు ఆయనకు చె ప్పా రు. ఆయన ఇంటికి వచ్చి భార్యకు ఈ విష యం చెప్పాడు. కుమారుడి జాడ తెలియక పోవడంతో  దంపతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement