గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు.
విజయనగరం జిల్లా: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం విజయనగరం జిల్లా సాళూరు మండలం కోట్టుపరువు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాములు (60) ఉపాధి కూలీగా పనిచేస్తున్నాడు. రోజులాగే గురువారం పనికి వెళ్లిన రాములుకి గుండెపోటు రావడంతో అక్కడే కూలబడిపోయాడు. రాములుకి భార్య, ఇద్దరు కుమారులున్నారు. విషయం తెలిసిన ఏపీవో రాములు కుటుంబానికి ప్రభుత్వం తరపున అందాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకుంటామని ప్రకటించారు.
(సాళూరు)