
యనమల అమెరికా అధ్యక్షుడు కావాల్సింది..
ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన పదవిని చీప్ గా చూసుకునే అహంభావి ఎవరైనా ఉన్నారంటే అది యనమలేనని ఎద్దేవా చేశారు. యనమల అమెరికా అధ్యక్షుడు కావాల్సిందని.. తప్పిపోయి ఏపీలో పుట్టి ఆర్థికమంత్రి అయ్యారని విమర్శించారు. ఈ ఏడాది తుని నియోజకవర్గంలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దమ్ముంటే యనమల బహిరంగ చర్చకు రావాలని రాజా సవాల్ విసిరారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, వైఎస్సార్ సీపీ నేతలను విమర్శించడానికి యనమలకు ఎంతమాత్రం అర్హత లేదన్నారు. ఇప్పటికే రెండు సార్లు తుని ప్రజలు యనమలను ఛీ కొట్టారని రాజా విమర్శించారు.