ఇండియా ఓడింది... అభిమాని గుండె ఆగింది 

Cricket fan suffers heart attack while watching India vs New Zealand match  - Sakshi

పూసపాటిరేగ (నెల్లిమర్ల): వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో బుధవారం ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా ఓడిపోవడం చూస్తూ తట్టుకోలేని ఓ అభిమాని గుండెపోటుతో టీవీ ముందే కుప్పకూలాడు. ఈ విషాదం విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన మీసాల రాము(35) ఎంవీజీఆర్‌ కళాశాలలో టెక్నీషియన్‌.  బుధవారం సాయంత్రం వరకు తోటి ఉద్యోగులందరితోను సరదాగా గడిపిన అతను అనంతరం టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ ఉత్కంఠకు లోనయ్యాడు. భారత్‌ ఓటమి అంచుకు చేరగా ఒత్తిడికి లోనై టీవీ చూస్తుండగానే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. రాముకు భార్య ప్రమీల, రెండేళ్ల కుమారుడు వున్నారు.  మృతదేహాన్ని స్వగ్రామమైన రెల్లివలసకు రాత్రి 10 గంటల సమయంలో తీసుకువచ్చారు.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top