బెజవాడలో 10మంది బుకీల అరెస్ట్ | cricet betting gang-arrested in vijayawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో 10మంది బుకీల అరెస్ట్

Feb 22 2015 11:12 AM | Updated on Sep 2 2017 9:44 PM

ఓ వైపు వరల్డ్ కప్ మ్యాచ్లు కొనసాగుతుంటూ మరోవైపు బెట్టింగ్ బాబుల జోరు ఊపందుకుంది.

విజయవాడ : ఓ వైపు వరల్డ్ కప్ మ్యాచ్లు కొనసాగుతుంటూ మరోవైపు బెట్టింగ్ బాబుల జోరు ఊపందుకుంది. విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10మంది బుకీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.42 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లు గుట్టుగా నడుస్తున్నాయి. భారత్, సౌతాఫ్రికా మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా బెట్టింగ్ జోరందుకుంది. తమ అభిమాన క్రికెటర్ బౌలర్, బ్యాట్ మెన్‌లపై వ్యక్తిగత పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు టీం జయాపజయాలపై పందాలు కాస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement