
గ్రాడ్యుయేట్లు, టీచర్లు టీడీపీకి బుద్ది చెప్పారు
ఎమ్మెల్సీ ఎన్నికలు సీఏం చంద్రబాబు నాయుడికి, లోకేశ్‌కు గుణపాఠం నేర్పాయని సీపీఎం నేత బాబురావు అన్నారు.
ఏపీలో మీడియా చంద్రబాబు చేస్తున్న రాజకీయాలకు వత్తాసు పలుకుతోందిని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం టీడీపీ వందల కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టిందని అన్నారు. చంద్రబాబుకు రాబోయే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, తానే సీఎం అవుతాననే అహంభావం పనికిరాదని సీపీఎం నేత బాబురావు అన్నారు. అలాంటి భ్రమలు పనికిరవ్వాని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పుతారన్నారు.