ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసనగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వామపక్షాల నేతలు ఆందోళన నిర్వహించారు.
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసనగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వామపక్షాల నేతలు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం ఉదయం సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌ఐఆర్‌డీ సెంటర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రధాన మంత్రి మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీలకు చెందిన ఇరవై మంది నేతలను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు.