'అనంత'లో కొనసాగుతున్న ఆందోళనలు


అనంతపురం: వేరు శెనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ అనంతపురం పట్టణంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని తపోవనం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో 44వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో బెంగళూరు - హైదరాబాద్ రహదారిలో కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పోయాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద సీపీఐ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసేంత వరకు తమ దీక్షలు ఆపేది లేదని ఈ సందర్భంగా సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకుని సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ తో సహా 100 మంది సీపీఐ నేతలను అరెస్టు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top