పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఓ ప్రైవేట్ లాడ్జిలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.
	హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా  తణుకులోని ఓ ప్రైవేట్ లాడ్జిలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి మృతి చెందాడు.  భార్య పరిస్థితి విషమంగా ఉంది. రాజమండ్రి సమీపంలోని  కాతేరు గ్రామానికి చెందిన శ్రీకృష్ణ, కళ్యాణి దంపతులు గత కొంతకాలంగా వీరు తణుకులో నివాసం ఉంటున్నారు. నివాసం తణుకులో ఉంటున్నా, వీరు ఆదివారం రాత్రి ఓ లాడ్జిలో  రూము అద్దెకు తీసుకున్నారు. అనారోగ్యం, ఆర్థిక పరమైన కారణాల వల్ల వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వీరికి ఇంటర్ చదివే ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.
	
	ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడులో అవనిగడ్డ నాగేశ్వరరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ హత్యకు కుటుంబకలహాలే కారణమని  పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా కలిదిండి మార్కెట్ యార్డ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. నలుగురు గాయపడ్డారు. ఆగి ఉన్న లారీని  ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  ఇదే జిల్లా నూజివీడు పట్టణం పోతిరెడ్డిపల్లి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తిరుపతిరావు అనే వ్యాపారి మృతి చెందాడు. లారీ-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
	
	మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి తాండాలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి  చెందాడు.
	
	మెదక్ జిల్లా  వర్గల్ మండలం గౌరారం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ-బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
