దేశంలోనే మోడల్ విలేజ్‌గా ‘డోకిపర్రు’ | Country Model Village 'dokiparru' | Sakshi
Sakshi News home page

దేశంలోనే మోడల్ విలేజ్‌గా ‘డోకిపర్రు’

Jan 15 2015 1:55 AM | Updated on Sep 2 2017 7:43 PM

మండలంలోని డోకిపర్రును ఆ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త మెగా ఇంజినీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ పి.పి. రెడ్డి దత్తత తీసుకున్నారు.

గ్రామాన్ని దత్తత తీసుకున్న   మోగా ఇంజినీర్స్ సంస్థ
మెయిల్ సంస్థ చైర్మన్ పి.పి. రెడ్డి

 
గుడివాడ : మండలంలోని డోకిపర్రును ఆ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త మెగా ఇంజినీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చైర్మన్ పి.పి. రెడ్డి దత్తత తీసుకున్నారు. గ్రామ కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దేశంలోనే మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. గ్రామస్తులు కమిటీగా ఏర్పడి గ్రామానికి, గ్రామంలోని ప్రతి కుటుంబానికీ కావాల్సిన అవసరాలను చర్చించి నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డితోపాటు సిమెంటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేగాక ప్రతి ఇంటికీ మినరల్ వాటర్‌తోపాటు సోలార్ విద్యుత్, ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ సాయంతోపాటు దాదాపు రూ.7కోట్లకు పైగా వెచ్చిస్తామని చెప్పారు.
 
స్వచ్ఛ భారత్ కోసం ప్రత్యేక ప్రణాళిక

 రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడితే ఆయా గ్రామాల జనాభాను బట్టి తమ సంస్థ నగదు ప్రోత్సాహకం అందిస్తుందని పి.పి.రెడ్డి చెప్పారు. ప్రతి నెలా 50 గ్రామాలను గుర్తించి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. 2వేలలోపు జనాభా ఉంటే రూ.30వేలు, 5వేలు జనాభా ఉంటే రూ.50వేలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. సమావేశంలో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ పురిటిపాటి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచి పురిపాటి వీరారెడ్డి, ప్రముఖులు కనుమూరి రామిరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు వీరమాచినేని శివప్రసాద్, సర్పంచి జోగి వెంకటేశ్వరరావు మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement