కార్పొరేషన్ మేయర్ | corporation mayer | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ మేయర్

Mar 2 2014 3:55 AM | Updated on Jun 1 2018 8:47 PM

మూడున్నరేళ్లుగా నగరపాలక, పురపాలక ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నడుం బిగించింది.

అనంతపురం కార్పొరేషన్ : మూడున్నరేళ్లుగా నగరపాలక, పురపాలక ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నడుం బిగించింది.

ఆ క్రమంలో శనివారం కార్పొరేషన్ మేయర్, మున్సిపాల్టీ, నగర పంచాయతీ చైర్మన్, అధ్యక్ష స్థానాలు, డివిజన్లు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2010  సెప్టెంబరు 29 నాటికి నగర, పురపాలక పాలక వర్గాల పదవీ కాలం పూర్తయింది.

నగర, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్  ప్రభంజనానికి ప్రభుత్వం కుప్పకూలిపోతుందనే భయంతో కిరణ్ సర్కారు వాయిదా మంత్రాన్ని అందుకుంది. నగర, పురపాలక సంఘాల్లో 2010 సెప్టెంబరు 29న ఆర్నెల్లపాటూ ప్రత్యేకాధికారుల పాలనను విధించిన ప్రభుత్వం.. ప్రతి ఆర్నెల్లకోసారి దానిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ వచ్చింది.
 

Advertisement
 
Advertisement
Advertisement