చెక్‌పాయింట్‌‌లు ఎత్తివేత వార్తలు అవాస్తవం

coronavirus: Interstate border checkpoints to Stay, says Krishnababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పాయింట్‌‌లను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్‍ టాస్క్ ఫోర్స్ చైర్మన్‍ కృష్ణబాబు స్పష్టం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పాయింట్లలన్నీ లాక్‌డౌన్‌ ముగిసేవరకూ కొనసాగుతాయన్నారు. పలు టీవీ చానల్స్‌లో చెక్‌పాయింట్లు ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారంతా కచ్చితంగా ‘స్పందన’ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని కృష్ణబాబు సూచించారు. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ) నుంచి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండాలని కృష్ణబాబు పేర్కొన్నారు. అలాగే తెలంగాణకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని తెలిపారు. (16 రోజులు.. రూ. 29.44 కోట్లు )

కాగా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. (వైద్య బలగాలు సంసిద్ధం!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top