కూల్‌డ్రింక్స్ తాగి ఇద్దరికి అస్వస్థత | cool drinks drinking by two people Illnesses | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్స్ తాగి ఇద్దరికి అస్వస్థత

Mar 22 2016 2:38 AM | Updated on Sep 3 2017 8:16 PM

కూల్‌డ్రింక్స్ తాగి ఇద్దరికి అస్వస్థత

కూల్‌డ్రింక్స్ తాగి ఇద్దరికి అస్వస్థత

కూల్‌డ్రింక్స్ తాగిన ఇద్దరు అస్వస్థతకు గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు

మాచర్ల   కూల్‌డ్రింక్స్ తాగిన ఇద్దరు అస్వస్థతకు గురై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన అం బటి హనుమాయమ్మ, ఆమె సోదరుడు కోటిరెడ్డి వీరారెడ్డి ఆదివారం తమ పనులపై గుంటూరు వెళ్లారు. తిరిగి వ చ్చి మాచర్లలోని లాడ్జి సెంటర్‌లోని ఓ కూల్‌డ్రింక్ షాపులో రెండు కూల్‌డ్రింక్ బాటిళ్లను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. సోమవారం ఎండలు అధికంగా ఉండటంతో ఒక బాటిల్‌ను ఇద్దరూ తాగారు. ఆ సమయంలో వారికి కళ్లు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. బంధువులు 108 వాహనంలో మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అవి తాగడం వల్లే..
బాధితులు వీరారెడ్డి, హనుమాయమ్మ విలేకరులతో మాట్లాడుతూ తాము గడువు ముగిసిన కూల్‌డ్రింక్ తాగడం వల్లే ఇబ్బందిపడ్డట్టు తెలిపారు. విషయాన్ని పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా అది తమ పరిధి కాదని వెల్దుర్తి స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సమాధానం చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement