కరోనా నివారణకు ఏపీ సర్కార్‌ మరిన్ని చర్యలు

Control Room For Corona Suspects In Andhra Bhavan At Delhi - Sakshi

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైరస్‌ నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో  ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అలాగే ఏపీ సచివాలయంలోని ఎన్నాఆర్టీ సెల్‌లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు అయింది. ఇక కరోనా కారణంగా విదేశాల్లో అనేక విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి విద్యార్థులు తమ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. (స్వీయ గృహ నిర్బంధమే మేలు)

మరోవైపు ఐఏఎస్‌ అధికారి జేవీ మురళీని రాష్ట్ర ప్రభుత్వం కో ఆర్డినేటర్‌గా నియమించింది. అలాగే ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి విదేశాంగ శాఖతో సమన్వయం కానున్నారు. అలాగే పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఎప్పుటికప్పుడు హై లెవల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా మంత‍్రులు ఆళ్ల నాని, మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,  ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారు మేడపాటి వెంకట్‌ ఉన్నారు.

  • ఢిల్లీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 9871999055 / 9871999059
  • ఏపీలో కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 8971170178 / 8297259070

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top