
సైకిల్ ఎక్కనున్న రాయపాటి సాంబశివరావు!
గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం అయ్యింది.
న్యూఢిల్లీ : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఢిల్లీ ఏపీ భవన్‌లో దీక్ష చేస్తున్న చంద్రబాబును ఆయన గురువారం కలిసి సంఘీభావం తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం లక్షలాది మంది రోడ్ల మీద పోరాడుతున్న పట్టించుకోవడం లేదని రాయపాటి విమర్శించారు.
హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా కాని ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేయడంతోనే కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధం ముగిసిందని తెలియజేశారు. పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు రాయపాటి టీడీపీలో చేరే విషయమై మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ను విలేకర్లు ప్రస్తావించగా.... రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ను వీడరని తెలిపారు.