సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ : సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ రెచ్చగొడుతోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమం వల్ల తీవ్ర పరిణమాణాలు ఎదురు అవుతాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అన్ని పార్టీలు కారణమని సోమిరెడ్డి అన్నారు.
ఓ ఛానల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయటానికే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందనటం సరికాదన్నారు. విభజన ప్రకటన అనంతరం తెలంగాణపై పలు పార్టీలు యూటర్న్ తీసుకున్నాయన్నారు.