లోక్ అదాలత్‌కు హాజరుకాని హిందూపురం మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా అదనపు జడ్జి రాములు పేర్కొన్నారు.
ఎన్నిసార్లు నోటీసు పంపినా లోక్ అదాలత్‌కు హాజరుకాని హిందూపురం మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా లోక్ అదాలత్ చైర్మన్, జిల్లా అదనపు జడ్జి రాములు పేర్కొన్నారు. శనివారం హిందూపురంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ సహా అధికారులెవరూ హాజరుకాలేదు. మున్సిపల్ కమిషనర్ గత రెండేళ్లుగా ఏ లోక్ దాలత్‌కు హాజరుకాలేదని, ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్పందించడంలేదని జిల్లా అదనపు జడ్జి రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ మేరకే ప్రజలకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా లోక్ దాలత్‌లను నిర్వహిస్తున్నామని, వాటిపట్ల అధికారుల్లో చులకన బావం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.