కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు | CM YS Jagan Mohan Reddy Dinner On The 17th For Collectors And SPs | Sakshi
Sakshi News home page

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్‌ విందు

Dec 15 2019 3:13 AM | Updated on Dec 15 2019 8:34 PM

CM YS Jagan Mohan Reddy Dinner On The 17th For Collectors And SPs - Sakshi

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17వ తేదీన విందు ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. విజయవాడలోని బరం పార్క్‌లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చించనున్నట్లు వెల్లడించాయి.

Advertisement
 
Advertisement
Advertisement