
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం గన్నవరం చేరుకుంటారు. వెంటనే ఆయన పోలవరం ఏరియల్ సర్వేకు బయల్దేరతారు. కాఫర్ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు 10 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు భారీగా వస్తోంది.
కాగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటన పొగిడింపు కారణంగా గురువారం పులివెందుల, పెనుకొండలో సీఎం పర్యటనలు రద్దయ్యాయి. పెనుకొండలో కియా కొత్తకారు విడుదలకు ముఖ్యమంత్రికి బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు.