సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌

CM YS Jagan To Hold Review Meeting On Coronavirus - Sakshi

పక్కాగా ఆరోగ్య ఆసరా పథకం

సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి

చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్ ఏర్పాటు చేయాలి

అధికారులను ఆదేశించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : టెలీమెడిసిన్‌ కోసం కొత్త బైక్‌లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ఎమెర్జెన్సీ సేవలకు కూడా ఏ లోటూ చూడాలన్నారు. బుధవారం ఆయన కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలన్నారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. (చదవండి : 2 లక్షలు దాటిన కరోనా వైద్య పరీక్షలు )

పక్కాగా ఆరోగ్య ఆసరా
►ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
►ఇది ఈ ప్రభుత్వంలో కొత్తగా పెట్టిన కార్యక్రమమని, అమల్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.

ఏ లోటూ లేకుండా ఎమర్జెన్సీ సేవలు
సీఎం ఆదేశాల మేరకు ఎమర్జెన్సీ సేవలను గుర్తించామన్న అధికారులు.
గర్భిణీలు, కీమోథెరఫీ, డయాలసిస్‌ వంటి ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారందర్నీ గుర్తించామని చెప్పారు.
షెడ్యూలు ప్రకారం వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు
షెడ్యూలు సమయానికి వైద్య సిబ్బందే కాల్‌ చేసి వైద్య సేవల కోసం వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారని సీఎం జగన్‌కు వివరించారు.
క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది అన్ని రకాలుగా వారికి అండగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు.

సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు
గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించామని వెల్లడి. 
ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్‌లోడ్‌ కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలన్న సీఎం
ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం

జూలై 1న 108 సర్వీసులు ప్రారంభం
108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం
అలాగే టెలి మెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశం

చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్‌
రాష్ట్రంలో స్థానికంగా విక్రయించేలా చూడాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశం
దీని కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలి
దీనిపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం
అలాగే రైతులు పండించిన ఇతర ఉత్పత్తులు కూడా కనీసం 30 శాతం స్థానిక వినియోగం ఉండేలా చూడాలి

చేపలకు ధర, మార్కెటింగ్‌ విషయాల్లో చర్యలు తీసుకోవాలని మంత్రి మోపిదేవికి సీఎం ఆదేశం
ట్రేడర్లతో మాట్లాడాలని సీఎం ఆదేశం
అలాగే ట్రేడర్లకు అవసరమైన మార్కెటింగ్‌ ఇతర రాష్ట్రాల్లో లభించేలా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్‌కు సీఎం ఆదేశం.

పండ్ల ఉత్పత్తులు
రాయలసీమ తదితర జిల్లాలలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న పండ్లు, టమోటాలకు మరింత మార్కెట్‌.
కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోదాముల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top