27న విజయవాడకు కేసీఆర్‌ | CM KCR To Visit Vijayawada Kanaka Durga On Sep 27 | Sakshi
Sakshi News home page

27న విజయవాడకు కేసీఆర్‌

Sep 6 2017 2:19 PM | Updated on Aug 15 2018 8:12 PM

27న విజయవాడకు కేసీఆర్‌ - Sakshi

27న విజయవాడకు కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ పర‍్యటన ఖరారైంది.

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ పర‍్యటన ఖరారైంది. విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి ఈ నెల 27 న కేసీఆర్‌ విజయవాడ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు.
 
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్‌ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మొక్కులు తీర్చుకుంటున్నారు.  కేసీఆర్‌ ఇప్పటికే వరంగల్‌ భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, స్వర్ణపత్రాలు, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి స్వర్ణ సాలిగ్రామమారం, స్వర్ణ కంఠాభరణాలు, కురవి వీరభద్రుడికి బంగారు మీసం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement