ఆ సమస్య పునరావృతం కాకూడదు: సీఎం జగన్‌ | CM Jagan Mohan Reddy Reviewed on Leg Swelling in East Godavari District | Sakshi
Sakshi News home page

కాళ్లవాపు బాధితులకు చికిత్స అందించండి: సీఎం జగన్‌

May 25 2020 3:56 PM | Updated on May 25 2020 4:33 PM

CM Jagan Mohan Reddy Reviewed on Leg Swelling in East Godavari District - Sakshi

తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపు వ్యాధి ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులను ఆరా తీశారు.

సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపు వ్యాధి ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులను ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కాళ్లవాపు వ్యాధి మళ్లీ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని సీఎం ఆదేశించారు. తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానిని, అధికారులను బాధితులను పరామర్శించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అదేవిధంగా దీనిపై ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా సీఎం జగన్‌ ఆదేశాలు జారీచేశారు.

(సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు)

మరోవైపు న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులకు స్పష్టం చేశారు. లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను తమ ప్రభుత్వం ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీ చేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. (నిరూపిస్తే రాజీనామా చేస్తా: ఎంపీ సవాల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement