‘గురు స్మరణలో’ ఆవిష్కరించిన సీఎం జగన్‌

CM Jagan Launches Guru Smaranalo Book On Budharaju Radhakrishna - Sakshi

బూదరాజు సేవలు చిరస్మరణీయం: ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ‘గురు స్మరణలో’  పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయుడు బూదరాజు రాధాకృష్ణ 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం రూపొందించిన కవితా సంకలనం ‘గురు స్మరణలో’  పుస్తకాన్ని సీఎం జగన్‌ శనివారం క్యాంప్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో  ఆవిష్కరణ చేశారు.  పత్రికా రంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్‌ పాల్గొన్నారు. 

కాగా ‘బూరా బృందం’ గా పిలుచుకునే బూదరాజు శిష్యులు పి.మధుసూదన్, ముని సురేష్‌ పిళ్ళె, ఎస్‌.రాము ఈ సంకలనాన్ని అందుబాబులోకి తీసుకువచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ... కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తాము హాజరు కాలేకపోయామని తెలిపారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top