12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన | CM chandrababu's china tour stasrs from april 12th | Sakshi
Sakshi News home page

12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన

Apr 10 2015 7:31 PM | Updated on Aug 14 2018 11:26 AM

12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన - Sakshi

12 నుంచి సీఎం చంద్రబాబు చైనా పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12 నుంచి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరుతారని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట తనతో సహా మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, పలువురు ఉన్నతాధికారులు వెళతామని పరకాల తెలిపారు. చైనా ఆర్థిక రాజధాని షాంగై తోపాటు బీజింగ్, చింగ్డో నగరాల్లో చంద్రబాబు బృందం పర్యటించనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement