
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిసెంబర్‌లో కాకినాడ రానున్నారని హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలో 50 రోజులపాటు ఇంటింటా తెలుగుదేశం నిర్వహించాలని సూచించారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ‘కైజాలాయాప్’పై పార్టీ నేతలకు శిక్షణ ఇచ్చారు. ఈయాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకుని సమస్యలు, ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి, పెందుర్తి వెంకటేష్, పులవర్తి నారాయణమూర్తి, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, కాకినాడ, రాజమహేంద్రవరం నగర మేయర్లు సుంకర పావని, పంతం రజనీశేషసాయి తదితరులు పాల్గొన్నారు.