విధులు బహిష్కరించిన హమాలీలు | civil supplies workers dharna at parvatipuram | Sakshi
Sakshi News home page

విధులు బహిష్కరించిన హమాలీలు

Jul 27 2015 11:03 AM | Updated on Sep 3 2017 6:16 AM

విజయనగరం జిల్లాలో పౌరసరఫరాల శాఖ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు విధులు బహిష్కరించారు.

పార్వతీపురం: విజయనగరం జిల్లాలో పౌరసరఫరాల శాఖ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు విధులు బహిష్కరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పౌర సరఫరాల శాఖ గోదాముల వద్ద ఆందోళనలకు దిగారు. పార్వతీపురంలో ఆందోళన చేస్తున్న హమాలీలు గోదాముల వద్ద మూడున్నర టన్నుల కాంటాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీకి ప్రస్తుతమున్న రూ.12 నుంచి రూ.25కు పెంచాలని కోరారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆగస్టు 3వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement