
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మధుమేహ వ్యాధిపై విస్తృత అవగాహన కలిగించినందుకు గాను నగరానికి చెందిన మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్ మంజుభార్గవికి జాతీయ స్థాయి డయాబెటీస్ ఎవేర్‌నెస్ ఇనిషియేటివ్ అవార్డు 2017 లభించింది. ఈ నెల 1న కోల్‌కత్తాలోని బిస్వబంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన 8 వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డయాబెటీస్ ఇండియా 2018 సదస్సులో ఆమె అవార్డు అందుకున్నారు. మధుమేహ వ్యాధి నివారణకు ఆహార నియమాలు, జుంబా ఎరోబిక్ వర్క్ అవుట్స్, నేచురోపతి డైట్, ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ హీలింగ్ థెరఫీ వంటివాటితో మధుమేహ అదుపునకు కృషి చేయడంతో పాటు విస్తృత అవగాహన కలిగించినందుకు గాను ఈ అవార్డు లభించినట్లు చెప్పారు.