breaking news
Specialist Director
-
డాక్టర్ మంజుభార్గవికి జాతీయ అవార్డు
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మధుమేహ వ్యాధిపై విస్తృత అవగాహన కలిగించినందుకు గాను నగరానికి చెందిన మధుమేహ వైద్య నిపుణురాలు డాక్టర్ మంజుభార్గవికి జాతీయ స్థాయి డయాబెటీస్ ఎవేర్నెస్ ఇనిషియేటివ్ అవార్డు 2017 లభించింది. ఈ నెల 1న కోల్‌కత్తాలోని బిస్వబంగ్లా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 8 వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డయాబెటీస్ ఇండియా 2018 సదస్సులో ఆమె అవార్డు అందుకున్నారు. మధుమేహ వ్యాధి నివారణకు ఆహార నియమాలు, జుంబా ఎరోబిక్ వర్క్ అవుట్స్, నేచురోపతి డైట్, ఆయుర్వేదిక్ ట్రెడిషనల్ హీలింగ్ థెరఫీ వంటివాటితో మధుమేహ అదుపునకు కృషి చేయడంతో పాటు విస్తృత అవగాహన కలిగించినందుకు గాను ఈ అవార్డు లభించినట్లు చెప్పారు. -
ఎలుకే బ్రహ్మానందమా!
కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ముఖ్యపాత్రల్లో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ‘‘ఎలుక ప్రధానంగా ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు. ఇందులో ఎలుక మాట్లాడుతుంది. డాన్స్ చేస్తుంది. ఎలుక బ్రహ్మానందంలా మారుతూ, బ్రహ్మానందం ఎలుకలోకి వెళ్తూ ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా న వ్విస్తాయి. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో విడుదల కాస్త ఆలస్యమైంది. కామెడీ సినిమాలో గ్రాఫిక్స్‌కు అంత అవసరం ఉండదు. కానీ ఈ సినిమాలో సబ్జెక్ట్‌తో పాటు గ్రాఫిక్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. త్వరలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నాగేంద్రకుమార్, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్.