ఎలుకే బ్రహ్మానందమా! | Eluka Majaka Telugu Movie | Sakshi
Sakshi News home page

ఎలుకే బ్రహ్మానందమా!

Oct 13 2015 11:42 PM | Updated on Sep 3 2017 10:54 AM

ఎలుకే బ్రహ్మానందమా!

ఎలుకే బ్రహ్మానందమా!

కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘ఎలుకా మజాకా’.

 కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డెరైక్టర్ రేలంగి నరసింహారావు చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, పావని ముఖ్యపాత్రల్లో  మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెలలో  విడుదల కానుంది. ‘‘ఎలుక ప్రధానంగా ఇప్పటివరకూ ఏ సినిమా రాలేదు.

ఇందులో ఎలుక మాట్లాడుతుంది. డాన్స్ చేస్తుంది. ఎలుక బ్రహ్మానందంలా మారుతూ, బ్రహ్మానందం ఎలుకలోకి వెళ్తూ ఉండే సన్నివేశాలు  ప్రేక్షకులను కడుపుబ్బా న వ్విస్తాయి. ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో విడుదల కాస్త ఆలస్యమైంది. కామెడీ సినిమాలో గ్రాఫిక్స్‌కు అంత అవసరం ఉండదు. కానీ ఈ సినిమాలో సబ్జెక్ట్‌తో పాటు గ్రాఫిక్స్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. త్వరలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నాగేంద్రకుమార్, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement