గల్లా vs గాలి | chitoor tdp leaders fight | Sakshi
Sakshi News home page

గల్లా vs గాలి

Jan 4 2015 2:53 AM | Updated on Sep 2 2017 7:10 PM

గల్లా vs   గాలి

గల్లా vs గాలి

మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య శాసనమండలి ఎన్నికలు చిచ్చు రేపాయి.

ఎమ్మెల్సీ పదవి కోసం మాజీ మంత్రులు గల్లా, గాలి ఎత్తులు
గల్లా అరుణకు వ్యూహాత్మకంగా మంత్రి బొజ్జల మద్దతు
మండిపడుతున్న ముద్దుకృష్ణమ

 
 
తిరుపతి: మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల మధ్య శాసనమండలి ఎన్నికలు చిచ్చు రేపాయి. ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవడం కోసం ఇరువురూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. బల సమీకరణకు దిగుతున్నారు. మంత్రి బొజ్జల వ్యూహాత్మకంగా గల్లా అరుణకుమారికి దన్నుగా నిలుస్తున్నారు. తనను ఒంటరి చేసే దిశగా ఆమె పావులు కదుపుతుండడంపై గాలి ముద్దుకృష్ణమనాయుడు మండిపడుతున్నారు. టీడీపీ ఆవి ర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న మాజీ మంత్రి ముద్దుకృష్ణమ 1999లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పదేళ్ల తర్వాత 2009లో మళ్లీ టీడీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన గాలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కే రోజా చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో విజయం సా ధించి ఉంటే గాలికి చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కేదనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. పార్టీని స్థాపించినప్పటి నుంచి టీడీపీకి చేసిన సేవలను గుర్తించి.. తనకు ఎమ్మెల్సీ పదవితోపాటూ మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబుపై ఏడు నెలలుగా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి టీడీపీతో ప్రధానంగా చంద్రబాబుతో రాజకీయంగా విభేదిస్తూ వచ్చిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. సార్వత్రిక ఎన్నికలకు ముందు  అనూహ్యంగా సైకిలెక్కారు.

కుమారుడు గల్లా జయదేవ్‌తో కలిసి టీడీపీలో చేరా రు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి గల్లా జయదేవ్.. చంద్రగిరి అసెంబ్లీ స్థా నం గల్లా అరుణకుమారిలకు టీడీపీ టికెట్లు దక్కాయి. గల్లా జయదేవ్ గుం టూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధిస్తే.. అరుణకుమారి చంద్రగిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి చంద్రబాబు కోటరీలో జయదేవ్ కీల కంగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎ న్నికల్లో టీడీపీకి భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చడం వల్లే జయదేవ్‌కు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో పార్టీకి చేసిన సేవలకుగానూ తన తల్లికి ఎమ్మెల్సీ పదవితోపాటూ మంత్రివర్గంలో చోటు కల్పించాలని చంద్రబాబుపై జయదేవ్ ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవాలన్న లక్ష్యంతో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాలను అధికంగా చేయించేందుకు అరుణకుమారి అధికారవర్గాలను పావులుగా వినియోగించుకున్నారనే విమర్శలు వ్యక్తమైన విషయం విదితమే. జిల్లాలో అధికశాతం మంది టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల మద్దతు సంపాదించి.. చంద్రబాబువద్ద బల నిరూపణకు ఆమె పావు లు కదుపుతున్నారు. ఇటీవల డీఆర్వో నియామకం విషయంలో మంత్రి బొజ్జ ల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. సీఎం చంద్రబాబు జో క్యంతో వెనక్కి బొజ్జల వెనక్కి తగ్గడంతో గాలి సూచించిన అధికారినే డీఆర్వోగా నియమించారు. ఈ క్రమంలోనే మంత్రి బొజ్జల వ్యూహత్మకంగా గల్లాకు దన్నుగా నిలుస్తున్నారు.

వారం క్రితం తిరుపతిలో గల్లా ఇంటికి వెళ్లిన బొజ్జల.. ఎమ్మెల్సీ పదవి విషయం బాసటగా నిలుస్తానని హమీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిం చాయి. ఇది గాలికి ఆగ్రహాన్ని తెప్పిం చింది. మరో వైపు ఆయనను ఒంటరిని చేసి.. ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకునే దిశగా గల్లా పావులు కదుపుతోండటం తో టీడీపీలో బల సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆదినుంచి పా ర్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న తనను కా దని గల్లాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే అధిష్ఠా నంతో అమీతుమీ తేల్చుకోవడానికి సై తం సిద్ధమని గాలి తన అనుయాయుల వద్ద స్పష్టీకరిస్తుండడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement