ప్రత్యేక హోదాపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

Chiranjeevi On Special Category Status - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎప్పటికైన ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే అని కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. 2019లో రాహుల్‌ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పడూ మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు.

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి సహా ఒడిశా రాష్ట్ర కాంగ‍్రెస్‌ ఇంచార్జ్‌గా నియమితులైన గిడుగు రుద్రరాజు.. శనివారం చిరంజీవిని హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజును ఆయన అభినందించినట్టు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top