రోడ్డుప్రమాదంలో చిన్నారి దుర్మరణం | child died in guntur district road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో చిన్నారి దుర్మరణం

Dec 9 2015 1:59 PM | Updated on Aug 30 2018 3:56 PM

గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిగా... ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.

చిలకలూరిపేట: గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిగా... ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. కోటప్పకొండ సమీపంలో ఈటీ వద్ద ఆటోను ఇన్నోవా కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకి చెందిన సమీరా బేగం అనే ఆరేళ్ల పాప చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement