12న ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు | Chief Chandrababu release on the 12th house | Sakshi
Sakshi News home page

12న ఇల్లు మారనున్న సీఎం చంద్రబాబు

Apr 4 2015 1:04 AM | Updated on Jul 28 2018 3:23 PM

ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 12న అద్దె ఇంట్లోకి మారనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 65లోని...

సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 12న అద్దె ఇంట్లోకి మారనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 65లోని తన సొంత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 24లో అద్దె ఇంట్లోకి మారుతున్నారు.
 
నేడు ఢిల్లీకి..: చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ ఇచ్చే విందులో పాల్గొంటారు. ఆదివారం న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే న్యాయమూర్తుల సమావేశానికి కూడా సీఎం హాజరవుతారు.
 
నైపుణ్య కేంద్రం ప్రారంభం: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నైపుణ్య కేంద్రాన్ని ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిథి సమన్వయకర్త నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఐటీ కంపెనీలతో పాటు వివిధ సంస్థలకు ఇంటర్వ్యూలకు వెళ్లే గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement