వాహనాల నంబర్ ప్లేట్‌లను మార్చేసి దోపిడీలు, అక్రమ రవాణాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన
‘ప్లేట్’ ఫిరాయింపునకు చెక్!
Dec 22 2013 3:50 AM | Updated on Sep 2 2017 1:50 AM
	విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్:వాహనాల నంబర్ ప్లేట్‌లను మార్చేసి దోపిడీలు, అక్రమ రవాణాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైసెక్యూరిటీ ప్లేట్‌ల విధానాన్ని జిల్లాలో కూడా త్వరలో అమలు చేయనున్నారు. ప్రస్తుతం  హైదరాబాద్, సంగారెడ్డి ల్లో అమలవుతోంది.  ఈ మేరకు రాష్ట్ర రవాణశాఖ కమిషనర్ నుంచి అధికారులకు శనివారం ఆదేశాలు అందాయి. రెండు నెల ల్లో హైసెక్యూరిటీ ప్లేట్‌ల విధానం అమల్లోకి రావాలని ఆదేశించారు. ఏ వాహనానికి ఎంత ఫీజు తీసుకోవాలన్న వివరాలు కూడా వచ్చాయి. దీంతో జిల్లాపై రూ.6 కోట్లపైనే భారం పడనుంది.
	 
	 
	 
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	 వాహనాల వివరాలు
	 జిల్లాలో లక్షా 30 వేల వరకూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు 70 వేలు, కార్లు వెయ్యి, జీపులు రెండు వేలు, లారీలు ఐదు వేలు, ట్రాక్టర్లు నాలుగు వేలు, ఇతర వాహనాలు 10 వేలు వర కు ఉన్నాయి. వీటన్నింటికీ హైసెక్యూరిటీ ప్లేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. తొలుత నూతన వాహనాలకు నంబర్ ప్లేట్లను అమర్చుతారు.
	 పాత వాహనాలకూ తప్పదు..
	 పాతవాహనాలకు కూడా ఈ ప్లేట్లు తప్పని సరిగా అమర్చాలి. 2015 డిసెంబర్ కల్లా పాత వాహనాలకు ప్లేట్లును పూర్తిస్థాయిలో అమర్చాలని  ఆదేశాల్లో పేర్కొన్నారు.
	 లాభాలు:
	 హైసెక్యూరిటీ ప్లేట్లలో ఓ చిప్‌ను ఏర్పాటు చేస్తారు. దీంట్లో వాహనం పూర్తి వివరాలు పొందుపరుస్తారు. దీంతో వాహనాలను దొంగిలించినా విక్రయించడానికి కుదరదు. వాహనాల దొంగతనాలకు, నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలను అక్రమ రవాణాకు ఉపయోగించిన తరవాత దహనం చేయడానికి వీలుండదు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనం పూర్తిగా కాలిపోతే, కాలిపోడానికి ఆస్కారం లేని చిప్ ద్వారా వివరాలను సేకరించవచ్చు.  
	 రెండు కౌంటర్లు..
	 హైసెక్యూరిటీ ప్లేట్ల జారీ కోసం విజయనగరం పట్టణంలో రెండు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. రవాణశాఖ కార్యాలయం వద్ద ఒకటి, ఆర్టీసీ కాంప్లెక్సులో మరో కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలు నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు పనిచేస్తాయి.
	 ఒక సారి అమర్చితే....అంతే
	 వాహనాలకు హైక్యూరిటీ ప్లేట్లను ఒక సారి అమర్చితే వాటిని మార్చడానికి, సరిచేయడానికి వీలుండదు. లేజర్‌కోడ్‌లో వాహనాల నంబర్, యజమాని ఫోటో, ఇతర పూర్తి వివరాలు పొందుపరిచి ఉంటాయి. వీటిని ఆన్‌లైన్ ద్వారా ఎక్కడైనా చూడవచ్చు.హైసెక్యూరిటీ ప్లేట్ల ధరలు అధికంగా ఉన్నాయని, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రభుత్వం మాత్రం ధరలను తగ్గించలేదు.  
	 ధరల వివరాలు
	 వాహనం ధర 
	 టూవీలర్ రూ.245
	 త్రీవీలర్  రూ.282
	 కారు రూ.619
	 ట్రాక్టర్‌ట్రైలర్,లారీలు, రూ.619
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
