
భూముల రేట్లు పెంచితే ఊరుకోం: బాబు
త్వరలో విజయవాడ నుంచే పరిపాలన ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
విజయవాడ: త్వరలో విజయవాడ నుంచే పరిపాలన ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం విజయవాడలో డీడీ సప్తగిరి ఛానల్ను వెంకయ్యనాయుడుతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ప్రాంతాలను మెగా సీటిగా అభివృద్ధి చేస్తామన్నారు.
రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు భూములు రేట్లు పెంచితే చూస్తు ఊరుకోమని రియల్టర్లను హెచ్చరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని రైతులకు పిలుపు నిచ్చారు. పెరిగిన వృద్ధాప్య, వికలాంగుల ఫించన్లు అక్టోబర్ 2 నుంచ అమలు చేస్తామన్నారు.