ఒంగోలులో చంద్రబాబు పోస్టర్లు దగ్దం | Chandrababu Naidu posters fired by seemandhra people | Sakshi
Sakshi News home page

ఒంగోలులో చంద్రబాబు పోస్టర్లు దగ్దం

Oct 4 2013 3:11 PM | Updated on Sep 1 2017 11:20 PM

విభజనపై కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఒంగోలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలి.

విభజనపై కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఒంగోలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలి. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను కార్పొరేషన్ ఉద్యోగులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు.

 

కోల్కత్తా - చెన్నై జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. అలాగే జిల్లాలోని కనిగిరి చర్చ్ సెంటర్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. చంద్రబాబు పోస్టర్లను తగులబెట్టారు. పామూరు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్కు కాశిరెడ్డి, వైఎమ్ ప్రసాద్ రెడ్డిలు నిరసన చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement