తిరుపతి ఎన్కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తిరుపతి ఎన్కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో అధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. మృతుల ఫోటోలు విడుదల చేసి బంధువులకు సమాచారం అందించాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అలాగే ఎర్ర చందనం స్మగ్లర్ల ఎదురు కాల్పుల్లో గాయపడిన పోలీసులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
మరోవైపు తిరుపతి ఎన్కౌంటర్ సంఘటనపై గవర్నర్ నరసింహన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో వివరించారు. అంతకు ముందు డీజీపీ జేవీ రాముడు ...చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే.