'సమ్మెపై బాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు' | Chandra sekhar reddy takes on chandrababu naidu due to RTC Strick | Sakshi
Sakshi News home page

'సమ్మెపై బాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'

May 7 2015 11:48 AM | Updated on Sep 3 2017 1:36 AM

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి అభిప్రాయపడ్డారు.

కడప: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కావని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి అభిప్రాయపడ్డారు. గురువారం కడపలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సమ్మె ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలవలేదని ఆయన ఆరోపించారు.

మరో వైపు ముఖ్యమంత్రి యూనియన్ నాయకులు చర్చలకు రావడం లేదంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తమకున్న ఒకే ఒక్క మార్గం సమ్మె చేయడమే అని చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement